Home » Australia: సిడ్నీ బీచ్‌లో కాల్పులు.. 11 మంది మృతి..

Australia: సిడ్నీ బీచ్‌లో కాల్పులు.. 11 మంది మృతి..

by Post Editor
0 comments
Australia Mass Shooting

Mass shooting Australia: ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరమైన సిడ్నీ తుపాకీ మోతలతో దద్దరిల్లింది. సిడ్నీ నగరంలోని బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరు ఆగంతకులు తుపాకీలతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కనీసం 11 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు సాయుధులు ఒక వంతెనపై నుండి పలు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీసారు. ఈ కాల్పుల్లో దాదాపు 11 మంది మృతిచెందారు. కాగా చాబాద్ ఆఫ్ బాండి నిర్వహించిన “చానుకా బై ది సీ” కార్యక్రమం జరుగుతున్న హనుక్కా వేడుకల సమయంలో ఈ దాడి జరిగిందని తెలిపారు.

You may also like