17
Train Accident: అస్సాంలో ఘోరం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున హోజాయ్ జిల్లాలో సైరాంగ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొనడంతో ఐదు భోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు మరణించాయి. ఈ ఘటన హోజాయ్‌లోని చాంగ్‌జురాయ్ ప్రాంతంలో తెల్లవారుజామున 2.17 గంటల ప్రాంతంలో జరిగింది.
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి ప్రకారం, మిజోరాంలోని సైరాంగ్‌ను ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌తో కలిపే ఈ రైలుకు చెందిన ఐదు కోచ్‌లు మరియు ఇంజన్ పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు కాలేదు. రాష్ట్ర రాజధాని గౌహతికి దాదాపు 126 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రమాద స్థలానికి అటవీ, రైల్వే శాఖల ఉన్నతాధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

