పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి సెమీస్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. గురువారం కాంస్య పతక పోరులో నెగ్గి భారత్ ఖాతాలో మరో కాంస్య పతకాన్ని చేర్చింది. బ్రాంజ్ మెడల్ పోరులో స్పెయిన్‌తో తలపడిన టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించింది. కాగా 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో కూడా టీమిండియా కాంస్య పతకం సాధించడం విశేషం. దీంతో టీమిండియా ఖాతాలో నాలుగు కాంస్య పతకాలు చేరాయి.