భారత రాజ్యాంగంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసమానతలపై పోరాడే శక్తివంతమైన ఆయుధం భారత రాజ్యాంగమని అన్నారు. సమాజంలో తారతమ్యాలకు వ్యతిరేకంగా నిలిచే సంస్థలను రాజ్యాంగం సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఓ పీ జిందాల్ యూనివర్శిటీ గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు సమాజంలో జరిగే అసమానతలను ప్రశ్నించాలని తెలిపారు.