ముంబై : భారతీయ విపణిలోకి వచ్చే ఏప్రిల్ నుంచి యూరో – 6 (బీఎస్-6) శ్రేణి పెట్రోల్, డీజిల్ ఇంధనం రానుంది. ప్రస్తుతం మనం యూరో-4 శ్రేణి ఇంధనాన్ని వాడుతున్నాం. యూరో-4 నుంచి నేరుగా యూరో-6 కి ఇంధనం ఉన్నతీకరణ జరగటం గమనార్హం. యూరో-6 శ్రేణి ఇంధనం వల్ల వాతావరణ కాలుష్యం చాలా మేరకు తగ్గి పోతుంది. దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నుంచి యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు.