Home » షేక్ హ‌సీనాను గ‌ద్దె దింపిన విద్యార్థి నాయ‌కుడు నహిద్ ఇస్లామ్

షేక్ హ‌సీనాను గ‌ద్దె దింపిన విద్యార్థి నాయ‌కుడు నహిద్ ఇస్లామ్

0 comment
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చింది ఓ విద్యార్థి నాయకుడు. రాజీనామా చేసి ఆమె దేశం విడిచేలా చేసింది విద్యార్థి నాయకుడే. అతని పేరు నహిద్ ఇస్లామ్ . 30 శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా నహిద్ ఇస్లామ్ తీవ్ర పోరాటం చేశాడు. బంగ్లాదేశ్ను కుదిపేసిన ఆ ఉద్యమం నడిపింది నహిద్ ఇస్లామే. ఆ స్టూడెంట్ నేత .. రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసింది. నహిద్ ఇసల్ఆమ్ ప్రస్తుతం ఢాకా యూనివర్సిటీలో సొసియాలజీ చదువుతున్నాడు. మానవ హక్కుల కార్యకర్తగా కూడా అతనికి గుర్తింపు ఉన్నది. విద్యార్థ ఉద్యమ సంఘానికి జాతీయ కోఆర్డినేటర్గా ఉన్నాడు. ఫ్రీడం ఫైటర్ల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం తీర్పును ఇవ్వడంతో నహిద్ ఇస్లామ్ ఉద్యమం చేపట్టాడు. ఆ కోటా వివక్షపూరితమైందన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు రాజకీయంగా ఆ విధానం అమలు చేస్తున్నట్లు ఆరోపించాడు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహిద్ ప్రచారం చేశాడు. విద్యార్థి నాయకులను ఉగ్రవాదులుగా పోల్చడంతో.. నహిద్ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశాడు. షాభాగ్లో నిరసనకారుల్ని ఉద్దేశిస్తూ.. విద్యార్థులు కట్టెలు పట్టుకున్నారని, ఒకవేళ కర్రలు పనిచేయకుంటే ఆయుధాలు పట్టుకుంటారని హెచ్చరించాడు.జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహిద్ ఇస్లామ్ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అతని కండ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల తర్వాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు. గోనోసహస్త్య నగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో అతన్ని అపహరించారు. నహిద్ను ఎత్తుకెళ్లలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు.

Leave a Comment