న్యూఢిల్లీ: వరల్డ్ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్లసన్పై ఇండియన్ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నమెంట్లో ఆ విక్టరీతో ప్రజ్ఞానంద లీడ్లోకి వెళ్లారు. ఇటీవల ర్యాపిడ్ లేదా ఎగ్జిబిషన్ గేమ్స్లో పలుమార్లు కార్లసన్పై ప్రజ్ఞ గెలుపొందాడు. అయితే ఈ గేమ్లో మూడు రౌండ్ల తర్వాత 5.5 పాయింట్లతో లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రజ్ఞానంద తెలుపు పావులతో మ్యాచ్ ఆడాడు. కార్లసన్పై విక్టరీ కొట్టడంతో టోర్నీ ఫెవరేట్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి పడిపోయారు. క్లాసికల్ చెస్ను స్లో చెస్గా కూడా పిలుస్తారు. క్రీడాకారులు ఒక ఎత్తు వేయడానికి తమకు కావాల్సినంత సమయాన్ని తీసుకుంటారు. కనీసం ఒక గంట సమయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫార్మాట్లో గతంలో ఇద్దరి మధ్య జరిగిన మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి. మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి టాప్ ప్లేస్లో నిలిచింది. ఆమె 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. అన్నా ముజిచక్తో జరిగిన మ్యాచ్ను ఆమె డ్రాగా ముగించుకున్నది.