Oppo F27 5G Specifications Leaked: స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో దేశీయ మార్కెట్లో హవా చూపిస్తోంది. తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికి దేశీయ మార్కెట్లో చాలా మోడళ్లను పరిచయం చేసింది. ఇక త్వరలో మరొక సరికొత్త మోడల్‌తో వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలో కంపెనీ తన తదుపరి F-సిరీస్ హ్యాండ్‌సెట్‌గా Oppo F27 5G ఫోన్‌ను భారతదేశంలో ప్రారంభించనుంది.