33
Narges Mohammadi Arrest News: 2023 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదిని ఇరాన్ భద్రతా దళాలు అక్రమంగా అరెస్టు చేశాయని ఆమె మద్దతుదారులు ఎక్స్ వేదికగా తెలిపారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన న్యాయవాది స్మారక కార్యక్రమంలో ఆమెను అరెస్టు చేసినట్లు ఆమె స్వచ్ఛంద సంస్థ మొహమ్మది ఫౌండేషన్ పేర్కొంది. ఇప్పటివరకు నర్గీస్ మానవ హక్కుల కోసం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక సార్లు జైలుకు వెళ్లారు. చివరగా 2024 డిసెంబర్‌లో తాత్కాలిక సెలవు మీద ఆమె జైలు నుండి బయటకు వచ్చారు. మానవ హక్కుల కోసం ఆమె చేసిన పోరాటానికి గుర్తింపుగా 2023లో ఆమెను నోబెల్ శాంతి బహుమతి వరించింది.

