Home » Lionel Messi: గోట్ టూర్ ఆఫ్ ఇండియా.. మెస్సీకి దీది క్షమాపణలు..

Lionel Messi: గోట్ టూర్ ఆఫ్ ఇండియా.. మెస్సీకి దీది క్షమాపణలు..

by Post Editor
0 comments

Mamata Benarjee Apologies Lionel Messi: గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ, ఆటగాళ్లు లూయిస్ సూరెజ్, రోడ్రిగో డీ పాల్ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకి విచ్చేశారు. అంతకుముందు లేక్ టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు షారుక్ ఖాన్ మెస్సీకి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సాల్ట్ లేక్ స్టేడియంకి చేరుకున్నారు. కేవలం మెస్సీ 10 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండటంతో ప్రేక్షకులు ఆగ్రహించారు.

ఆగ్రహంతో ప్రేక్షకులు స్టేడియంలోని కుర్చీను ధ్వంసం చేసి గ్రౌండ్‌లోకి విసిరేసారు. బాటిళ్లను గ్రౌండ్‌లోకి విసిరేసారు. దీంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ మెస్సీ రాక కోసం చేసిన ఏర్పాట్లపై నివేదిక కోరారు. సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర గందరగోళం చెలరేగిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లియోనెల్ మెస్సీకి క్షమాపణలు చెప్పారు. ఆమె యాజమాన్యాన్ని కూడా నిందించారు. ఈ పరిస్థితిని సమీక్షించడానికి విచారణకు ఆదేశాలిచ్చారు.

You may also like