18
Cold Wave in Telangana: గత కొన్ని రోజులుగా తెలంగాణలో చలి పంజా విసురుతుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. ఇదే తంతు మరికొన్ని రోజులు కొనసాగునుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా తెలిపారు. డిసెంబర్ 16 నుంచి 18 తేదీల మధ్య రాత్రి పూట ఉష్ణోగ్రతలు కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ చలి తీవ్రంగానే ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఆ తరువాత రోజుల్లో చలి విజృభించనుందని తెలిపారు.

