Home » Priyanka Gandhi: ఎన్నికల కమిషన్‌పై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు..

Priyanka Gandhi: ఎన్నికల కమిషన్‌పై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు..

by Post Editor
0 comments
Priyanka Gandhi

Priyanka Gandhi Speech in Vote Chor Gaddi Chod Mega Rally: ఎన్నికల ప్రక్రియలోని ప్రతి దశ ప్రశ్నార్థకంగా మారిందని, ఇది పౌరులలో తీవ్ర అనుమానాన్ని రేకెత్తిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ ఆదివారం ఆరోపించారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “ఓట్ చోర్, గడ్డి చోడ్” మెగా ర్యాలీలో ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్య సంస్థలు క్రమపద్ధతిలో బలహీనపడుతున్నప్పుడు ప్రజలు మాట్లాడాలని ఆమె నొక్కి చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల పేర్లను ప్రియాంక గాంధీ నేరుగా ప్రస్తావించారు. ప్రజల ఓటు హక్కులను హరించడానికి వారందరు కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎప్పటికైనా వారు తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ వారిని ఎల్లకాలం రక్షించలేదని తేల్చి చెప్పారు.

You may also like