Telangana Panchayat Elections Second Phase: తెలంగాణలో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న హస్తం పార్టీ.. రెండో విడతలోనూ హవా కొనసాగించింది.
మొత్తం 31 జిల్లాల్లోని 193 మండలాల్లో 4,333 గ్రామ పంచాయతీలు, 38,350 వార్డులకు ఇవ్వాళ ఎన్నికలు జరగగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 1770, బీఆర్ఎస్ 941, బీజేపీ 202, ఇతరులు 497 స్థానాలు కైవసం చేసుకున్నారు.
విశేషాలు
నాగర్ కర్నూల్ జిల్లా వెంకయ్యపల్లి సర్పంచ్ ఫలితం టాస్ ద్వారా తేలింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా ఆర్వో టాస్ వేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు వెంకటలక్ష్మిని అదృష్టం వరించింది.
Panchayat Elections: తెలంగాణలో పల్లె పోరు.. కొనసాగుతున్న రెండో విడత పోలింగ్..
అటు దేవరకద్ర ఎమ్యెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించడం విశేషం. ఇక నల్లగొండ జిల్లాలోని ఇసుకబావిగూడెం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు కల్లూరి అనిత ఒక్క ఓటుతో విజయం సాధించడం విశేషం.

