Home » India vs South Africa: చెలరేగిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికాపై ఘనవిజయం..

India vs South Africa: చెలరేగిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికాపై ఘనవిజయం..

by Post Editor
0 comments

India vs South Africa 3rd T20I Dharamsala: ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో(India vs South Africa) జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 3 వికెట్లు కోల్పోయి అలవోకగా గెలిచింది. టీమిండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ 35 ( 18 బంతుల్లో), శుభమన్ గిల్ 28 (28 బంతుల్లో), తిలక్ వర్మ 25* (34 బంతుల్లో) రాణించడంతో 15.5 ఓవర్లలో విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవరల్లో హెండ్రిక్స్ డకౌట్ అవ్వగా, రెండో ఓవర్లో డీ కాక్‌ను హర్షిత్ రాణా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లో రాణా బ్రెవిస్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ మార్క్‌రమ్ 61 పరుగులు చేసి సౌతాఫ్రికాను ఆదుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్, రాణా, వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు తీయగా, దూబే, హార్థిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన అభిషేక్ శర్మ 18 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఎండ్‌లో గిల్ ఆచితూచి ఆడాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ నుండి తప్పించుకున్న గిల్ నెమ్మదిగా ఆడాడు. 28 పరుగులు చేసిన గిల్‌ను యాన్సెన్ బౌల్డ్ చేశాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(12), దూబే(10*) టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు.

Also Read: Vaibhav Suryavanshi: 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 14 ఇయర్స్ చిన్నోడు..

ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాల్గో టీ20 లక్నో వేదికగా ఈ నెల 17న జరగనుంది.

You may also like