Home » Maharashtra Civic Body Polls: జనవరిలో ముంబయి స్థానిక పోరు..

Maharashtra Civic Body Polls: జనవరిలో ముంబయి స్థానిక పోరు..

by Post Editor
0 comments

Brihanmumbai Municipal Corporation Maharashtra Civic Body Polls: ఆసియాలోనే సంపన్న కార్పొరేషన్ అయిన బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌‌లో ఎన్నికల నగారా మోగింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు(Maharashtra Civic Body Polls) రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వాఘ్మారే సోమవారం విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. 29 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 32 జిల్లా కౌన్సిళ్లు, 336 పంచాయతీ సమితులకు జనవరి 15న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

దాదాపు 3 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికల్లో ఈవీఎంలో ఉపయోగించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. షెడ్యూల్ వెల్లడించడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

You may also like