Chargesheet filed by NIA Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ జమ్మూలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 1597 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తంగా ఏడుగురు నిందితుపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వీరిలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT), దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఉన్నారు. ఈ ఉగ్రదాడిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ సాజిద్ బట్‌ను కీలక కుట్రదారుడిగా పేర్కొన్నారు. సాజిద్‌పై ఎన్‌ఐఏ రూ. 10 లక్షల రివార్డును ప్రకటించింది.
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొన్ని వారాల తర్వాత, జూలై 2025లో శ్రీనగర్‌లోని దాచిగామ్‌లో ఆపరేషన్ మహాదేవ్ సందర్భంగా భారత భద్రతా దళాలు ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులను ముట్టుబెట్టింది. ప్రస్తుత ఛార్జిషీట్‌లో వారి ముగ్గురి పేర్లను కూడా ఎన్ఐఏ పేర్కొంది. వారిని ఫైసల్ జట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హంజా ఆఫ్ఘానీగా గుర్తించారు. ఇక వీరికి ఆశ్రయం కల్పించిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోథర్ పేర్లను కూడా పొందుపరిచింది.

