32
Nitish Kumar pulls woman’s hijab at event: బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఓ మహిళ హిజబ్ లాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెయ్యి మందికి పైగా ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందించే సమయంలో ఓ మహిళ హిజబ్ లాగారు.
ఈ సంఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీ సీఎం చర్యపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నితీశ్ కుమార్‌కు మతిభ్రమించినట్లు ఉందంటూ ఎక్స్ వేదికగా అసంతృప్తిని వెల్లడించింది. వెంటనే నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జేడీయూ బీజేపీ కూటమి వైఖరి ఏంటో ఈ సంఘటన తెలియజేస్తోందంటూ ఆర్జేడీ విమర్శలు గుప్పించింది.

