PM Modi Jordan Tour: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా సోమవారం అమ్మన్‌లోని హుస్సేనియా ప్యాలెస్‌లో జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్‌ను కలిశారు. ఈ సమావేశంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాజు అబ్దుల్లా II నాయకత్వంలోని జోర్డాన్ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ మానవాళికి ఒక బలమైన, వ్యూహాత్మక సందేశాన్ని పంపిందని ఆయన అన్నారు
కింగ్ అబ్దుల్లా II ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్‌కు చేరుకున్నారు. కింగ్ అబ్దుల్లా II ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన తన మూడు దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, తన ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

