Director Anooya Swamy’s Pankaj Selected for Sundance Film Festival 2026: బెంగళూరుకు చెందిన చిత్ర దర్శకురాలు అనూయ స్వామి రూపొందించిన లఘు చిత్రం ‘పంకజ్’ సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. దీంతో ఈ లఘు చిత్రం సన్ డ్యాన్స్ కు ఎంపికైన మొదటి కన్నడ లఘు చిత్రంగా గుర్తింపు పొందింది. ప్రపంచ వేదికపై ప్రాంతీయ భారతీయ సినిమాకు ఇది గొప్ప గుర్తింపు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం లోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడక్షన్ లో అనూయ స్వామి ఎం.ఎఫ్.ఏ చదువుతోంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనూయ స్వామి ఆస్కార్ అవార్డ్ గ్రహీత దర్శకుడు స్పైక్ లీ కి బోధనా సహాయకురాలిగా పనిచేసిన కొద్దిమంది ప్రతిభావంతులలో ఒకరు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్కాలర్షిప్ సహా అనేక గౌరవాలు అందుకున్నారు. పంకజ్ కథాంశం బ్లాక్ కామెడీ, సామజిక విమర్శ, అధికారిక సంయమనాన్ని మిళీతం చేస్తుంది. ‘పంకజ్’ అనేది మానవీయ సందర్భంలో షాక్, నైతిక అస్పష్టత వంటి సంక్లిష్ట భావోద్వేగాలను అన్వేషిస్తుంది. పంకజ్‌ను జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1, 2026 వరకు ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో జరిగే సన్ డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.

