Telangana Speaker Gaddam Prasad Verdict on Disqualification on Five MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పునిచ్చారు. పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వారు పార్టీ మారినట్లు తగిన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డిలు పార్టీ మారారని, వారిపై అనర్హత వేటు వేయాలని అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. కాగా ఈ విషయంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పలు దఫాలుగా విచారించిన సుప్రీం కోర్టు డిసెంబర్ 18వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ను సూచించింది. సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్., బుధవారం తీర్పును వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లు కొట్టివేశారు.
Telangana: పార్టీ మారినట్లు ఆధారాల్లేవు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు..
18

