Home » Telangana Gram Panchayat Elections: పల్లెపోరులో హస్తానిదే పైచేయి..

Telangana Gram Panchayat Elections: పల్లెపోరులో హస్తానిదే పైచేయి..

by Post Editor
0 comments
Telangana Panchayat Elections

Telangana Gram Panchayat Elections: తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు పెద్ద మొత్తంలో విజయం సాధించారు. మూడో దశ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 2140 స్థానాల్లో విజయం సాధించగా.. కారు పార్టీ బలపర్చిన అభ్యర్ధులు 1112 స్థానాల్లో విజయం సాధించారు. ఇక కమలం పార్టీ అభ్యర్థులు 228 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరులు 471 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు. మొత్తం మీద ప్రజలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు మూడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు తెలిపాయి. దాదాపు సగానికి పైగా పంచాయతీ స్థానాలను హస్తం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

You may also like