Home » PM Modi: ప్రధాని మోదీ ఒమన్ పర్యటన.. ఇరుదేశాల కీలక ఒప్పందం..

PM Modi: ప్రధాని మోదీ ఒమన్ పర్యటన.. ఇరుదేశాల కీలక ఒప్పందం..

by Post Editor
0 comments

PM Modi Oman Tour: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఒమన్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ ఉన్నత నాయకత్వంతో చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా రెండు దేశాలు ఒక ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. విమానాశ్రయంలో ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధానమంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిఖ్ అల్ సైద్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు.

కాగా ప్రధాని మోదీకి గల్ఫ్ దేశ పర్యటన రెండోది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పర్యటన సందర్భంగా ఒమన్‌తో ఒక ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంపై ఆశాజనకంగా ఉన్నట్లు భారత అధికారులు పేర్కొన్నారు.

You may also like