Home » SMAT 2025: చెలరేగిన ఇషాన్ కిషన్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఝార్ఖండ్ సొంతం..

SMAT 2025: చెలరేగిన ఇషాన్ కిషన్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఝార్ఖండ్ సొంతం..

by Post Editor
0 comments

Syed Mushtaq Ali Trophy SMAT 2025: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT 2025)ని ఝార్ఖండ్ కైవసం చేసుకుంది. హరియాణాతో జరిగిన ఫైనల్లో ఝార్ఖండ్ జట్టు 69 పరుగులతో ఘనవిజయం సాధించింది. కాగా ఝార్ఖండ్ జట్టుకు ఇది తొలి టీ20 ట్రోఫీ. ముందుగా ఫైనల్లో హరియాణా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ ప్రారంభించిన ఝార్ఖండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఝార్ఖండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ విరాట్ సింగ్ 2 పరుగులు మాత్రమే చేశాడు. వన్ డౌన్‌లో వచ్చిన కుశాగ్రా 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు మెరుపులు మెరిపించాడు. అనుకుల్ రాయ్ (40, 20 బంతుల్లో), రాబిన్ మిన్జ్ (31, 14 బంతుల్లో) చెలరేగడంతో హరియాణా ముందు 263 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

263 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హరియాణా 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. యశ్‌వర్ధన్ దలాల్ (53, 22 బంతుల్లో), నిశాంత్ సింధు(31, 15 బంతుల్లో), సమంత్ జఖార్(38, 17 బంతుల్లో) రాణించిన ఇతర బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో 69 పరుగుల తేడాతో ఝార్ఖండ్ ఘనవిజయం సాధిచింది. సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా, 18 వికెట్లు, 303 పరుగులు చేసిన అనుకుల్‌రాయ్‌‌ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

You may also like