14
G RAM G Bill gets Parliament nod: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కేంద్రం దాని స్థానంలో ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లును రాజ్యసభ మూజువాని ఓటు ద్వారా ఆమోదించిన. బిల్లు ఆమోదించిన తర్వాత రాజ్యసభను ఛైర్మన్ వాయిదా వేశారు. అంతకుముందు ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య రెండు సభలు ఈ బిల్లును ఆమోదించాయి. ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష నాయకులు లేని సమయంలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ పోడియం వద్ద నిరసన తెలిపి, ఆ తర్వాత సభ నుండి వాకౌట్ చేశారు.

