Home » Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మిన్నంటిన భారత వ్యతిరేక ఆందోళనలు..

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మిన్నంటిన భారత వ్యతిరేక ఆందోళనలు..

by Post Editor
0 comments

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొన్నాళ్ల క్రితం కాల్పుల్లో గాయపడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మృతిచెందారు. దీంతో ఆందోళనకారులు నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా సహా ఇతర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. హైది హంతకులు భారతదేశానికి పారిపోయారని ఆరోపించిన నిరసనకారులు, ఛటోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ వెలుపల కూడా నిరసన తెలిపారు. ఆందోళనకారులు భారత్, ఆవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మృతి చెందని షరీఫ్ ఉస్మాన్ హైదీ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్. దేశంలో ఫిబ్రవరి 12న జరిగే సాధారణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో గత వారం ఆయన తలపై కాల్పులు జరిపారు. తొలుత అతడిని బంగ్లాదేశ్ మెడికల్ కాలేజీలో చేర్పించారు, కానీ మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తరలించారు. 32 ఏళ్ల షరీఫ్ తన గాయాల కారణంగా మరణించాడని సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో బంగ్లాలో ఆందోళనలు మిన్నంటాయి.

You may also like