Home » SMAT 2025-26: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. అత్యుత్తమ ఆటగాళ్లు వీరే..

SMAT 2025-26: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. అత్యుత్తమ ఆటగాళ్లు వీరే..

by Post Editor
0 comments

SMAT 2025-26 Top five performers: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఝార్ఖండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలానికి ముందే ప్రారంభమైన ఈ ట్రోఫీతో పలువురు ఆటగాళ్లు వేలంలో జాక్‌పాట్ కొట్టారు. ముఖ్యంగా ఈ టీ20 టోర్నమెంట్ భారతదేశ భవిష్యత్ తారలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి జట్టులో చోటు కోల్పోయిన ఆటగాళ్లకు తిరిగి వెలుగులోకి రావడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. ఈ పోటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందు జరగడంతో, దేశీయ ఆటగాళ్లు కూడా తమను తాము నిరూపించుకోవడానికి, ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వంతో కూడిన టీ20 లీగ్‌లో తమ స్థానాన్ని దక్కించుకోవడానికి ఒక అవకాశం లభించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో అత్యుత్తమ ఆట కనబర్చిన ఐదుగురు ఆటగాళ్లా జాబితా:

1. ఇషాన్ కిషన్ – ఝార్ఖండ్
ఝార్ఖండ్ జట్టు తన తొలి టీ20 టైటిల్‌ను సంపాదించడంలో కీలక పాత్ర కెప్టెన్ ఇషాన్ కిషన్‌ది. జట్టును ముందుండి నడిపించాడు. 10 ఇన్నింగ్స్‌లలో 197.32 స్ట్రైట్ రేట్‌తో 517 పరుగులు సాధించాడు. హరియాణాతో జరిగిన ఫైనల్లో 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.

2. అశోక్ శర్మ- రాజస్థాన్
అశోక్ శర్మ రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ ఆటతీరుతో గుజరాత్ టైటాన్స్‌ను మెప్పించిన అశోక్‌ను రూ.90 లక్షలకు మినీ వేలంలో ఆ జట్టు కొనుగోలు చేసింది.

3. అనుకుల్ రాయ్- ఝార్ఖండ్
అనుకుల్ రాయ్, ఝార్ఖండ్ జట్టు కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 300కు పైగా పరుగులు, 18 వికెట్లతో అదరగొట్టాడు. కర్నాటక జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అనుకుల్ రాయ్ 95 పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ 7.34 ఎకానమీతో 18 వికెట్లు సాధించాడు.

4. అంకిత్ కుమార్- హరియాణా
హరియాణా జట్టు ఫైనల్ చేరండంలో అంకిత్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద 172.20 స్ట్రైక్ రేట్‌తో 448 పరుగులు చేశాడు.

5. సలిల్ అరోరా- పంజాబ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.1.5 కోట్లకు కొనుగోలు చేయడంతో సలిల్ అరోరా పేరు మారుమోగింది. పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 198.88 స్ట్రైక్ రేట్‌తో 358 పరుగులు చేశాడు. ఝార్ఖండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 125 పరుగులు సాధించాడు.

You may also like