Home » Rahul Gandhi: 20 ఏళ్ల చరిత్ర గల పథకాన్ని ఒక్క రోజులో భూస్థాపితం చేశారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: 20 ఏళ్ల చరిత్ర గల పథకాన్ని ఒక్క రోజులో భూస్థాపితం చేశారు: రాహుల్ గాంధీ

by Post Editor
0 comments

Rahul Gandhi On MGNREGA Scheme: యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ లైవ్‌లీహుడ్ మిషన్ గ్రామీణ్ (VB G RAM G Bill) బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) శుక్రవారం మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 20 ఏళ్ల చరిత్ర గత పథకాన్ని ఒక్క రోజులో భూస్థాపితం చేశారని అన్నారు. ఈ బిల్లు గ్రామాలకు వ్యతిరేకంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో MGNREGA పాత్రను రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. ఈ పథకం కోట్లాది మందిని ఆకలి నుంచి కాపాడిందని, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడిందని నొక్కి చెప్పారు. ఈ పథకం మహిళలు, దళితులు, ఆదివాసీలు, బహుజన వర్గాల ప్రజలకు సహాయపడిందని ఆయన అన్నారు. ఎటువంటి పరిశీలన లేకుండానే ఈ బిల్లును పార్లమెంటులో బలవంతంగా ఆమోదింపజేశారని ఆరోపించారు. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరించారని ఆయన అన్నారు. ఇటువంటి చర్యల ద్వారా ప్రధాని మోదీ కార్మికులను బలహీనపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

You may also like