8
AP EXAMS SCHEDULE: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి రాష్ట్రంలో పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలను సోమవారం ప్రకటించింది. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్ మే 12,13,14,15,18 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. తిరుపతిరావు ఓ ప్రకటనలో తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి మే 19,20 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసెట్ ఏప్రిల్ 23, ఐసెట్ ఏప్రిల్ 28, పీజీ ఈసెట్ ఏప్రిల్29, 30, మే 2, పీజీసెట్ మే 5, 8, 9, 10, 11 తేదీల్లో, లాసెట్, ఎడ్‌సెట్ మే4 న నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

