Mining in Aravallis: రాష్ట్రంలోని కీలకమైన పర్వత శ్రేణి అయిన ఆరావళి పర్వతాలను పరిరక్షించాలని కోరుతూ రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ఆరావళి శ్రేణి ప్రధాన ప్రాంతంలో(కోర్ ఏరియా) మైనింగ్‌కు అస్సలు అనుమతి లేదని అన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో మైనింగ్‌కు అనుమతి లేదని.. కొత్తగా మైనింగ్ లీజులు మంజూరు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు.
ఆరావళి శ్రేణి భారతదేశంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణి అని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారని భూపేంద్ర యాదవ్ అన్నారు. తాను కోర్టు తీర్పును చదివానని.. వాస్తవానికి ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఆరావళీ పర్వతశ్రేణి విస్తరించిందని తెలిపారు.
ఆరావళి శ్రేణిని రక్షించడానికి, విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోర్టుపేర్కొన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో పర్వత సంఖ్య పెరిగిందని అన్నారు. అంతేకాకుండా, 1.44 లక్షల చదరపు కిలోమీటర్ల ఆరావళీ శ్రేణి మొత్తం విస్తీర్ణంలో కేవలం 0.19% మాత్రమే మైనింగ్‌కు అనుకూలంగా ఉందని, మిగిలిన ఆరావళీ శ్రేణిని కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని అన్నారు.

