11
Medaram: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2026 ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గద్దెల పునర్నిర్మాణాలు, జాతర ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడారంలో నూతనంగా నిర్మించిన గద్దెలపై గోవిందరాజు, పగిడిద్దరాజులు కొలువుదీరారు. బుధవారం ఉదయం 6 గంటలకు గోవిందరాజును, ఉదయం 9.45 గంటలకు పగిడిద్దరాజును ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రితో పాటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్సీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు.

