Vaibhav Suryavanshi breaks AB de Villiers’ world record: రాంచీలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్ తరఫున ఆడుతూ వైభవ్ సూర్యవంశీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభ రోజున రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ యువ సంచలనం 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్ల సహాయంతో 226.19 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 190 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో, వైభవ్ లిస్ట్ ఎ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 150 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ 14 ఏళ్ల కుర్రాడు కేవలం 59 బంతుల్లోనే తన 150 పరుగులు పూర్తి చేశాడు, కాగా డివిలియర్స్ 2015లో వెస్టిండీస్‌పై కేవలం 64 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. జోస్ బట్లర్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు, అతను 2022లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఒక వన్డేలో 65 బంతుల్లో 150 పరుగులు చేశాడు.

