8
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లాలో కంటైనర్ లారీ ప్రైవేట్ స్లీపర్ బస్సును ఢీకొట్టింది. బస్సులో మంటలు చెలరేగి దాదాపు పది మంది సజీవదహనమయ్యారు. బస్సు బెంగళూరు నుండి గోకర్ణకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొని వెంటనే మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున హిరియూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదం లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. లారీ డివైడర్‌ను దాటి బస్సును ఢీకొనడంతో మంటలు చెలరేగి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

