Home » Nitin Gadkari: అతని హత్య షాక్‌కు గురిచేసింది: నితిన్ గడ్కరీ

Nitin Gadkari: అతని హత్య షాక్‌కు గురిచేసింది: నితిన్ గడ్కరీ

by Post Editor
0 comments

Nitin Gadkari on Hamas leader Haniyeh assassination: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari), ఇరాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్యకు గురికావడానికి ముందు ఆయనతో జరిగిన తన భేటీని గుర్తు చేసుకున్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు తాను గత ఏడాది జూలైలో టెహ్రాన్‌కు వెళ్ళినట్లు గడ్కరీ తెలిపారు.

ప్రమాణ స్వీకారానికి ముందు టెహ్రాన్‌లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్‌లో ప్రపంచ నాయకులు, ప్రముఖులు సమావేశమయ్యారని, అయితే హనియే ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించకపోవడంతో ఆయన తన దృష్టిని ఆకర్షించారని గడ్కరీ చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత హోటల్‌కు తిరిగి వెళ్లానని.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారతదేశంలోని ఇరాన్ రాయబారి తన వద్దకు వచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పారన్నారు. దీంతో తాను ఏమైందని అడగగా.. హమాస్ అధిపతి హత్యకు గురయ్యారని ఆయన బదులిచ్చారన్నారు. దీంతో తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు.

You may also like