14
Tirumala: వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ దేవస్థానమైన తిరుమలలో(Tirumala) భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరిషెడ్లు భక్తులతో నిండిపోయి ఉన్నాయి. భక్తులు శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి 29 తేదీలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీని రద్దు చేసింది టీటీడీ.

