AUS vs ENG Ashes Test Series: మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ నాలుగో టెస్టులో తొలిరోజే 20 వికెట్లు కుప్పకూలాయి. ముందుగా ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు జోష్ టంగ్ 5 వికెట్లతో చెలరేగగా.. అట్కిన్సన్ 2, కార్స్, స్టోక్స్ తలో వికెట్ తీసుకోని ఆసీస్ వెన్నువిరిచారు. దీంతో ఆస్ట్రేలియా 45.2 ఓవరల్లో 152 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో నెస్సర్ 35 పరుగులతో టాప్‌స్కోరర్ గా నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రూక్ తనదైన శైలిలో ఆడి 41 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 29.5 ఓవరల్లో 110 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో నెస్సర్ 4, బోలాండ్ 3, స్టార్ట్క్ 2, గ్రీన్ ఒక వికెట్ తీసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.

