Home » Telangana: తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..

Telangana: తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి..

by Post Editor
0 comments

Telangana: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులందరికీ హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఇవ్వాళ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులందరికీ 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. 28 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందినా హాస్టల్ సౌకర్యం కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వయస్సుకు వసతికి ముడి పెట్టడం సరి కాదన్నారు. ఉద్యోగ సాధన కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఈ నిబంధనల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వయస్సు నిబంధనను ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మనిమంజరి బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్ బీసీ విద్యార్థి సంఘం ఓయూ ఇన్చార్జి గోదా రవీందర్ గౌతమి పాల్గొన్నారు.

You may also like