Home » Telangana: హైదరాబాద్‌లో పోలీస్ కమిషనరేట్ల పునర్ వ్వవస్థీకరణ.. నూతన బాసులు వీరే..

Telangana: హైదరాబాద్‌లో పోలీస్ కమిషనరేట్ల పునర్ వ్వవస్థీకరణ.. నూతన బాసులు వీరే..

by Post Editor
0 comments

New Police Commissionerate’s in Telangana: హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్లను తెలంగాణ ప్రభుత్వం పునర్ వ్వవస్తీకరించింది. రాచకొండ కమిషనరేట్‌ నుంచి భువనగిరి జిల్లాను ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా తయారుచేసింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకానుంది.

రాచకొండ కమిషనరేట్‌ను పునర్ వ్వవస్థరీకరించి మల్కాజ్‌గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి బ్రెయిన్ చైల్డ్ అయిన ఫ్యూచర్ సిటీ కోసం కమిషనరేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్ల స్థానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ సోమవారం తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

అంతేకాకుండా నూతనంగా ఏర్పాటు చేసిన భువనగిరి పోలీస్ యూనిట్‌కు అక్షాంక్ష్ యాదవ్‌ను ఎస్పీగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం రాచకొండ కమిషనర్‌గా ఉన్న సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మహంతిని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా, ఐజీపీ(ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్)గా ఉన్నడా. ఎం రమేష్‌ను సైబరాబాద్ కమిషనర్‌గా నియమించింది.

You may also like