17
ACB Raids in Khammam RTA Office: ఖమ్మం రవాణాశాఖ (RTA) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం ఆకస్మిక దాడులు(ACB Raids) నిర్వహించారు. అక్రమ ధన లావాదేవీలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆఫీసు ప్రాంగణాన్ని సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న 15 మంది ప్రైవేటు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 70000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ కార్డులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, మరిన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రవాణాశాఖలో జరిగే లావాదేవీలకు సంబంధించి లంచాల డిమాండ్ ఉంటుందన్న ఫిర్యాదులపై విచారణను వేగవంతం చేస్తున్నట్లు ఏసీబీ సమాచారం అందించింది.

