18
AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. డిసెంబర్ 5వ తేదీన చిలకలూరిపేటలోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో లైబ్రరీకి కావల్సిన పుస్తకాలు, కంప్యూటర్లు ఇస్తానని ఆయన మాటిచ్చారు.
ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ కేవలం పది రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. సోమవారం పవన్ కళ్యాణ్ తరఫున పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు స్కూల్ యాజమాన్యానికి 25 కంప్యూటర్లు, లైబ్రరీకి కావల్సిన పుస్తకాలు, ఇతర ఫర్నిచర్‌ను అందించారు. దీంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

