బెంగళూరు:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ గురువారం ఇక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతకు ముందు అటవి శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేతోనూ సమావేశ మయ్యారు. కర్నాటకలో ఏనుగుల పట్టివేత, వాటినిమచ్చిక చేసుకోవటం, మావటీలకు శిక్షణ గురించి కూడా అటవి శాఖ ఉన్నతాధికార్లతో మంతనాలు జరిపారు.