10
Aravallis Mining Issue: పురాతనమైన ఆరావళి పర్వతాల్లో మైనింగ్ లీజుల అంశం దేశమంతటా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయడంపై పూర్తి నిషేధం విధించాలని అన్ని రాష్ట్రాలను కోరుతూ కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలోని పురాతన పర్వత వ్యవస్థలలో ఒకదానిని రక్షించడం ఈ చర్య లక్ష్యం అని అధికారులు తెలిపారు. మైనింగ్ కార్యకలాపాల నుండి దూరంగా ఉంచాల్సిన మరిన్ని ప్రాంతాలను గుర్తించడానికి సమగ్ర అంచనాను నిర్వహించాలని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌ను కూడా కోరింది.

