Home » కృష్ణుడు ఏలిన ద్వారకలో జన్మాష్టమి వేడుకలు వెరీ వెరీ స్పెషల్.. సుందరంగా ముస్తాబైన ఆలయాలు

కృష్ణుడు ఏలిన ద్వారకలో జన్మాష్టమి వేడుకలు వెరీ వెరీ స్పెషల్.. సుందరంగా ముస్తాబైన ఆలయాలు

0 comment
ద్వారక భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌లో ఉంది. ఇక్కడ జన్మాష్టమి పండుగ చాలా రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది. కన్నయ్య పుట్టిన రోజు వేడుకలను చూసి అద్భుతమైన అనుభూతిని పొందాలనుకుంటే జన్మాష్టమి రోజున ద్వారకకు తప్పకుండా వెళ్ళాల్సిందే.. కన్నయ్య దర్శనం కోసం లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి వచ్చే సోమవారం అంటే ఆగస్టు 26వ తేదీన జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నయ్య ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ పండుగ సంబరాలను మధుర, బృందావన్ నుంచి ఇస్కాన్ వరకు విభిన్నమైన వాతావరణాన్ని.. వేడుకల వైభవాన్ని చూడవచ్చు. అయితే శ్రీ కృష్ణుడు ఏలిన నగరమైన ద్వారకలో మాత్రం అన్ని ఆలయాలకు భిన్నంగా వేడుకలు జరుగుతాయి.
జన్మాష్టమికి కొన్ని రోజుల ముందుగానే ద్వారకను అందంగా అలంకరించారు. ముక్తి నగరంగా పిలువబడే ద్వారక నవ వధువు కంటే తక్కువ కాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీ కృష్ణ జన్మాష్టమిని శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిధిని జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజు ద్వారకలో కృష్ణ జన్మోత్సవం ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం..

Leave a Comment