Home » Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచార నిందితుడి శిక్ష నిలిపివేత.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీబీఐ..

Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచార నిందితుడి శిక్ష నిలిపివేత.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీబీఐ..

by Post Editor
0 comments

Unnao Rape Case: ఉన్నావ్ అత్యాచార కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు విధించిన జీవిత ఖైదును నిలిపివేసి, బెయిల్ మంజూరు చేయడాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 2017 ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. జీవిత ఖైదును నిలిపివేసి సెంగార్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఆదేశాలపై వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐ నిర్ణయించింది.

గతంలో, 2017 ఉన్నావ్ అత్యాచార కేసులో బహిష్కృత బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు విధించిన జైలు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. న్యాయవాదులు అంజలే పటేల్, పూజా శిల్పకర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధించాలని కోరింది. సెంగార్ తన జీవితాంతం జైలులోనే ఉండాలని ట్రయల్ కోర్టు పేర్కొన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు ఈ ఉత్తర్వును జారీ చేసిందని వారు వాదించారు.

Also Read: Bangladesh: బంగ్లాలో మైనారిటీలపై దాడులు.. తీవ్రంగా ఖండించిన భారత్..

సెంగార్‌కు తీవ్రమైన నేర చరిత్ర ఉన్నప్పటికీ, అత్యాచారం వంటి హేయమైన నేరాలలో అతని ప్రమేయం నిరూపితమైనప్పటికీ, అతనికి బెయిల్ మంజూరు చేయడం.. శిక్ష నిలుపుదల మంజూరు చేయడంలో హైకోర్టు చట్టపరంగా.. వాస్తవాల పరంగా తీవ్రమైన పొరపాటు చేసిందని పేర్కొన్నారు.

కాగా ఉన్నావ్ అత్యాచార కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న సెంగార్ ఇప్పటికే ఏడు సంవత్సరాల ఐదు నెలల జైలు శిక్ష అనుభవించారని పేర్కొంటూ, డిసెంబర్ 23న హైకోర్టు అతని జైలు శిక్షను నిలిపివేసింది.

You may also like