Maoists Surrender News: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. సోను దాదా ( మల్లోజుల వేణుగోపాల్), రూపేష్ ( ఆశన్న) బాటలోనే కేంద్ర కమిటీ సభ్యుడు రాంధేర్ ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. తనతో పాటు మరో 10 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. రాంధేర్పై రూ. 3 కోట్ల రివార్డు ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) జోన్లో రాంధేర్ క్రియాశీలకంగా ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు మిళింద్ తెల్టుంబే మరణించిన తర్వాత ఎంఎంసీ బాధ్యతలు రాంధేర్ చూస్తున్నారు. ఆయన లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ట్రై జంక్షన్ మావో రహిత జంక్షన్‌గా మారిందని పలువురు అభివర్ణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోలపై ఉక్కుపాదం మోపుతోంది. 2026 మార్చి 31లోగా మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్న సంగతి తెలిసిందే. మల్లోజుల, ఆశన్న, ఆజాద్ లొంగుబాటు.. హిడ్మా, నంబాల ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది.
Maoists: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్
54

