Home » CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్.. గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్.. గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

by Post Editor
0 comments

Telangana Rising Global summit: తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సోనియా గాంధీ, డా. మన్మోహన్ సింగ్ పాత్రలను గుర్తుచేశారు. 2047లోగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తమ లక్ష్యమని తేల్చిచెప్పారు.

“దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు పోరాడారు. సోనియా గాంధీ, డా. మన్మోహన్ సింగ్ వలన తెలంగాణ ప్రజల కల సాకారమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైయ్యి పదేళ్లయ్యింది. ఇప్పుడు మా దృష్టి అంతా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే. ప్రపంచంలోనే మేటి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాం. 2047వరకు తెలంగాణను అత్యున్నత స్థాయిలో నిల్చోబెట్టడానికి ఈ రైజింగ్ సమ్మిట్‌ను ఏర్పాటు చేశాం. 2034లోగా తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకుంది. 2047లోగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ జనాభాలో 2.9 శాతం జనాభా తెలంగాణలో ఉంది. కానీ 5 శాతం ఆదాయం కేంద్రానికి ఇస్తున్నాం. 2047లోగా భారతదేశ జీడీపీకి 10 శాతం ఆదాయాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏ రాష్ట్రం చేయని విధంగా క్యూర్, ప్యూర్, రేర్ గా తెలంగాణను 3 జోన్లుగా విభజించాం. చైనాలోని గ్యాంగ్‌డాంగ్ ప్రావిన్స్ మాకు ఆదర్శం. 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించింది. మాకు గ్యాంగ్‌డాంగ్ ప్రావిన్సే ఆదర్శం. చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా సింగపూర్ దేశాలు ఆదర్శం. తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

You may also like