Home » కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసుపై కొనసాగుతున్న నిరసనలు.. ఇప్పటికే 19 మంది అరెస్ట్

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసుపై కొనసాగుతున్న నిరసనలు.. ఇప్పటికే 19 మంది అరెస్ట్

0 comment
కోల్కతా : ఆర్జి కర్ ఆస్పత్రిలో ట్రైనీ లేడీ డాక్టర్ హత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగించిన క్రమంలో దేశవ్యాప్తంగా మన కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్న వారిలో భయాందోళనలు నెలకొనాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్య నేపథ్యంలో ఆర్జి కర్ మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా 24 గంటల బంద్ ప్రకటించింది.బంద్ ఆగస్టు 17వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి ఆగస్టు 18వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు కొనసాగుతుంది. దీంతోపాటు దేశంలోని అనేక వైద్య సంఘాలు కూడా బంద్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. ఇందులో ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ కూడా ఉంది. శాశ్వత పరిష్కారం చూపకపోతే వైద్యవృత్తితో సంబంధమున్న అనేక మంది ప్రజలు వీధిన పడతారని డీఎంఏ అధికారులు అంటున్నారు.

Leave a Comment