Home » Nalgonda: నల్లగొండ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..

Nalgonda: నల్లగొండ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..

by Post Editor
0 comments

Nalgonda: నల్లగొండ బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఓ వర్గం పిల్లి రామరాజుపై దాడి చేయగా.. మరికొందరు జిల్లా అధ్యక్షుడైన నాగం వర్షిత్ రెడ్డిపై దాడికి దిగారు. స్థానిక పోరులో బీజేపీ తరఫున గెలిచిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరుగుతుండా ఈ ఘటన చోటు చేసుకుంది. తనపై దాడి చేసిన వారు క్షమాపణ చెప్పాలని పిల్లి రామరాజు యాదవ్‌ కార్యాలయంలో బైఠాయించారు. కాగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల వద్ద నుండి మెమోరీ కార్డులు తీసుకుని ఫార్మాట్ చేశారు. దీంతో జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించారని మీడియా ప్రతినిధులు బీజేపీ కార్యాలయం ముందు బైఠాయించి.. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. చివరకు నాగం వర్షిత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో విషయం సద్దుమనిగింది.

You may also like