13
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో(National Herald Case) కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది.నేషనల్ హెరాల్డ్ కేసులో తమ మనీలాండరింగ్ ఫిర్యాదును విచారణకు స్వీకరించడానికి ట్రయల్ కోర్టు నిరాకరించడాన్ని కొట్టివేయాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేసింది. కాగా రెండు రోజులు క్రితం ఫిర్యాదును స్వీకరించడానికి తగినన్ని ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ ఛార్జిషీట్‌ను తిరస్కరించింది. కాగా దీనిపై అప్పీలుకు వెళ్లిన ఈడీ ట్రయల్ కోర్టు పేర్కొన అంశాలను పాయింట్ల వారీగా సవాల్ చేసింది. ఈ తీర్పు మనీలాండరింగ్‌కు సంబంధించి కీలకమైన ఆధారాలను విస్మరిస్తుందని ఆడీ వాదించింది.

