Home » Goa : అగ్ని ప్రమాద సంఘటన.. గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం..

Goa : అగ్ని ప్రమాద సంఘటన.. గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం..

by Post Editor
0 comments
GOA Fire accident

Goa government bans Firecrackers: గోవాలోని ఒక నైట్‌క్లబ్‌లో ఇటీవల ఘోర అగ్నిప్రమాద సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రంలోని అన్ని హోటళ్ళు, పబ్బులు, నైట్‌క్లబ్‌లు, రెస్టారెంట్లలో బాణసంచా కాల్చడం పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు ఇకముందు జరగకుండా గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కాగా నార్త్‌గోవాలోని గోవాలోని అర్పోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్‌లో డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. కాగా క్లబ్ ఇద్దరు ప్రధాన యజమానులు, సౌరభ్, గౌరవ్ లూత్రా థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది. అటు ఇంటర్ పోల్ వారిరువురిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.

You may also like