Harish Rao Comments on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వం అని.. రాజకీయాల కోసం తెలంగాణ పరువును తీయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నిలిపారని అన్నారు. తెలంగాణ కేసీఆర్ హయాంలో ఆర్థికంగా పరిపుష్టిని సాధించిందని పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది బీఆర్ఎస్ పాలన అని గుర్తుచేశారు. కాళేశ్వరం నీటిని వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం పండిస్తోందని అన్నారు. ఇక నీట పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్ తిరిగి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీరు చాలని కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖను ఎందుకు రాశారో తెలంగాణ ప్రజలకు వివరించాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 90 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని.. మిగతా 10 శాతం పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేపట్టలేదని ప్రశ్నించారు.
Harish Rao: రాజకీయాల కోసం తెలంగాణ పరువు తీయొద్దు: హరీశ్ రావు
15

